calender_icon.png 26 November, 2024 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యథేచ్ఛగా బెల్లం దందా

14-10-2024 01:18:38 AM

కర్ణాటక రాష్ట్రం నుంచి నల్లబెల్లం దిగుమతి చేస్తున్న వ్యాపారులు

తండాలకు సరఫరా 

ఎక్సైజ్ అధికారుల కళ్లుగప్పి రవాణా

వికారాబాద్, అక్టోబర్ ౧౩ (విజయక్రాం తి): నల్లబెల్లం దందా మళ్లీ మొద లైంది. నాటుసారా తయారీ, విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కొంతకాలం స్తబ్ధుగా ఉన్న వ్యాపారులు మళ్లీ మొదలుపెట్టారు. నాటుసారాను దాదాపు గా నిర్మూలించాలమని ఓ వైపు అధికారులు చెబుతున్నా.. మరో వైపు నల్లబెల్లం సరఫరా యథేచ్ఛగా సాగుతోంది.

వికారాబాద్ జిల్లాలో నల్లబెల్లం సరఫరా గుట్టుచప్పుడు కాకుండా అవుతోంది. నాటుసారా తయారీకి అవసర మైన నల్లబెల్లంపై నిషేధం ఉన్నా సంబంధిత ఎక్సైజ్ అధికారుల కళ్లుగప్పి అక్రమార్కులు నల్లబెల్లం సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలోని కుంచారం నుంచి పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లాలోకి సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే, సం బంధిత అధికారులు నామమాత్రంగానే నిఘా పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో నల్లబెల్లం జిల్లా సరిహద్దులు దాటి పల్లెల్లోకి పోతున్న ట్లు సమా చారం. అనుకోకుండా ఎక్సైజ్ అధికారులు  తనిఖీలు చేసినా బెల్లం దొరకకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

నల్లబెల్లం అందు బాటులో ఉండడంతో పలు తండాల్లో, గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా నాటుసారా తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికా రుల కంట పడకుండా అడవుల్లో, వ్యవసాయ పొలాల వద్ద సారా కాస్తున్నారు.  

ఒకేసారి 5180  కిలోలు పట్టివేత 

ప్రధానంగా నల్లబెల్లం కర్ణాటక రాష్ట్రంలోని కుంచారం నుంచి సరఫరా అవుతోంది. కొందరు వ్యాపారులు అక్కడ నల్లబెల్లం కొనుగోలు చేసి వికారాబాద్ జిల్లాలోని సరిహద్దు తండా లకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది జూలై 22న పెద్దేముల్ మండలం ఓమ్లానాయక్ తండా కు చెందిన ఓ వ్యాన్‌లో 5180 కిలోల నల్లబెల్లం తరలిస్తున్నట్లు పక్క సమాచారం అంద డంతో ఎక్సైజ్  డీటీఎస్ పోలీసు లు దాడులు చేసి పట్టుకున్నారు.

ఈ దాడుల సమయంలో నల్లబెల్లంతో పాటు కొంత నాటుసారాను కూడా స్వాధీనం చేసుకున్న ట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్  విజయ్ భాస్కర్ గౌడ్  అప్పట్లో ధ్రువీకరించారు. అయితే, అధికారులకు పట్టుబడింది ఈ ఒక్క వ్యాన్ మాత్ర మేనని, పట్టుబడ కుండా పోతున్నవి చాలానే ఉన్నాయని సమాచారం. ఇక్కడ విచిత్రమేమిటంటే జిల్లాలో ఎక్కడో ఒకచోట  నాటు సారా పట్టుబడుతున్నా ఎక్సై జ్ అధికారులు మాత్రం వంద శాతం నిషే ధం అమలవుతున్నట్లు చెప్పడం గమనార్హం.  

తక్కువకు కొని ఎక్కువ ధరకు

నల్లబెల్లం సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడంతో కొందరు అక్రమ వ్యాపారులకు అవకాశంగా మారింది. కర్ణాటకలో నల్లబెల్లంను కిలో రూ.40కి కొనుగోలు చేసి వికారాబాద్ జిల్లాలోని పలు తండాలకు వెళ్లి రూ.60 నుంచి రూ.100 చొప్పున అమ్ము తూ సొమ్ము చేసుకుంటున్నారు.

జిల్లాలో నాటుసారా తయారీ లేదు

జిల్లాలో ఎక్కడా నాటుసారా తయారీ జరగడం లేదు. ఎక్కడో ఒకచోట చిన్న మొత్తంలో తయారు చేస్తు న్నట్లు సమాచారం వచ్చినా వెంటనే దాడులు నిర్వహించి పట్టుకుంటు న్నాం. జూలైలో పట్టుబడ్డ నాటి నుంచి తిరిగి నల్లబెల్లం సరఫరా కాలేదు. సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశాం. 

 విజయభాస్కర్ గౌడ్, 

జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి