27-11-2024 02:18:58 AM
ది దక్కన్ ఆప్టికల్స్ అండ్ అల్లాయిడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): ది దక్కన్ ఆప్టికల్స్ అండ్ అల్లాయి డ్ ఇండస్ట్రీస్ లిమిలిటెడ్ కంపెనీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ కంపెనీని ప్రముఖ ఆప్టీషియన్ డాక్టర్ అమోలక్ రామ్ కపూర్ తొలుత 1901లో ఢిల్లీలోని బేయర్ రోడ్డు, కన్నాట్ ప్రాంతాల్లో చిన్నగా ప్రారం భించారు. ఆ తర్వాత ఔరంగాబా ద్‌లోని పంచచక్కిలో లెన్స్ తయారు చేసే అతిపెద్ద సంస్థలో ఒకదానిగా విస్తరించారు.
1920ల్లో అమెరికా నుంచి లెన్స్‌ను దిగుమతి చేసుకున్న మొట్టమొదటి సంస్థగా ఇది రికార్డు సృష్టించింది. ది దక్కన్ ఆప్టికల్స్‌కు లెన్స్‌ను సరఫరా చేసిన అమెరికా కంపెనీ 1960ల్లో ఫ్రాన్స్‌కు షిఫ్ట్ కావ డంతో అక్కడ నుంచి కూడా లెన్స్‌ను దిగుమతి చేసుకుంది. ఈ సంస్థకు అప్పట్లోనే సుమారు 1800 వందల యూనిట్లు ఉండగా అందులో సుమా రు 18 వేల మంది పురుషులు పని చేశారు.
తెలంగాణలో సంస్థను స్థాపిం చాల్సిందిగా నిజాం ప్రధాని పదే పదే ఆహ్వానం పంపడంతో తొలుత వరం గల్ 1932లో చిన్న స్టోర్‌ను ప్రారం భించారు. ఇక్కడ విశేష ఆధరణ రావడంతో ఔరంగాబాద్ నుంచి నాలుగు యూనిట్లను హైదరాబాద్ లోని బషీర్‌బాగ్‌కు తీసుకొచ్చారు. అప్పటి నుంచి తెలంగాణలో ఈ సంస్థ నిర్విరామంగా ప్రజలకు సేవలు అందిస్తోంది. రామ్ కపూర్ తర్వాత ఆయన వారసులు కంపెనీ సేవల్ని మరింత విస్తరించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు.