calender_icon.png 25 November, 2024 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి

25-11-2024 01:48:03 AM

పీఆర్టీయూ డిమాండ్

కామారెడ్డి, నవంబర్ 24 (విజయక్రాంతి): ఉద్యోగులకు ప్రభుత్వం నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరద్ధరించాలని పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత  సభ నిర్వహించారు.

ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. ఐదు ప్రధాన ఎజెండా అంశాలు సాధించే లక్ష్యంతో ఉపాధ్యాయ సమస్యలపై ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు మినిమం ట్రైం స్కేల్, హెల్త్ కార్డు ఇప్పించాలని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి, సత్యనారాయణ, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్‌రావు, ప్రధాన కార్యదర్శి జనాపాల లక్ష్మీరాజ్యం, క్రమశిక్షణ సంఘం కమిటీ అధ్యక్షుడు యుగేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు, ఆర్కే గ్రూప్స్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, సాయిబాబా, ఆదిప్రతాపరెడ్డి, అంకం సంతోష్, గజానంద్, నర్సింగరావు,రాము, కృష్ణ,  సురేందర్, లెనిన్, ఆనంద్, ఎల్లాగౌడ్, రాజశేఖర్, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.