calender_icon.png 24 October, 2024 | 3:52 PM

సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై వ్యతిరేకత

24-10-2024 01:41:06 AM

  1. రామన్నపేటలో నిరసనల మధ్యే ప్రజాభిప్రాయ సేకరణ
  2. ఉమ్మడి నల్లగొండ బీఆర్‌ఎస్ నేతల అడ్డగింత

యాదాద్రి భువనగిరి/ నల్లగొండ, అక్టోబర్ 23 (విజయక్రాంతి): యాదాద్రి భువన గిరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం శివారులో అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రా య సేకరణ పోలీస్ పహారా మధ్య సాగింది. 

సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రాజకీయ వర్గా లు, రైతులు, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేక త వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దాదా పు 360 ఎకరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వ ర్యంలో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ సభాస్థలి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ ప్రాంతంలో ఇప్పటికే మూసీ కాలుష్యం కారణంగా అవస్థలు పడుతున్నామని, ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఏ ర్పాటు చేయవద్దంటూ ప్లకార్డులతో రైతులు నిరసన తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంగణంలో  నినాదాలు చేస్తున్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇది నిర్బంధ పాలన: రవీంద్రకుమార్ 

రాష్ట్రంలో పోలీసు నిర్బంధ పాలన కొన సాగుతున్నదని బీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ విరుచుకుపడ్డా రు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యతో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడా రు.

ప్రభుత్వం ఏం ఆశించి రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని చూస్తుందో చెప్పాలని ప్రశ్నించా రు. సిమెంట్ పరిశ్రమతో 12 గ్రామాలు కాలుష్యమయంగా మారతాయని ఆందోళన వ్యక్తంచేశారు. పరిశ్రమల ఏర్పాటుకు బీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని, ఆ పేరుతో పచ్చని భూములను వినాశనం చేస్తే ఊరుకోబోమ ని హెచ్చరించారు.

తెలంగాణ వనరులను అదానీకి దోచిపెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారని ఆక్షేపించారు.  బీఆర్‌ఎస్ నాయకులను నిర్భందించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ముడి సరుకు, నీళ్లు లేని ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు వెనుక కుట్ర దాగుందని అనుమానం వ్యక్తం చేశారు.   రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రి కోమటిరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.  

బీఆర్‌ఎస్ నేతల గృహనిర్బంధం

సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ కార్యక్రమానికి వెళ్తున్న నల్లగొం డ జిల్లా బీఆర్‌ఎస్ ముఖ్యనేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపా ల్‌రెడ్డిని నల్లగొండలోని ఆయన నివాసం లో నిర్బంధించారు.

మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్‌ను మార్గమధ్యలో అదుపులోకి తీసుకొని నల్లగొండకు తరలించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్యను చిట్యాలలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు, సూర్యాపేట జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌ను రామన్నపేట శివారులో అదుపు లోకి తీసుకొని మోత్కూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.