calender_icon.png 19 April, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కంచగచ్చిబౌలి’పై విపక్షాల రాద్ధాంతం!

09-04-2025 01:32:16 AM

కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కంచ గచ్చిబౌలి భూముల విషయంలో విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

ఆ భూములపై సీబీఐ విచారణ వే యాలంటున్న కేంద్రమంత్రి బండి సంజ య్.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబునాయు డు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో ప్రధానమంత్రిగా వాజ్‌పేయ్ ఉన్నప్పుడే గచ్చిబౌలి భూ ములను బిల్లీరావు అనే వ్యక్తికి బదాలాయింపు జరిగిందనే విషయం తెలుసు కోవాలని హితవు పలికారు.

మంగళ వారం ఆయన గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు చరణ్‌కౌషిక్ యాదవ్, కిరణ్, శ్రీకాం త్ తదిత రులతో కలిసి మీడియాతో మాట్లాడారు.. రాష్ట్ర ప్రభుత్వం నెగిటివ్ పాలిటిక్స్, నెగిటివ్ పాలసీలతో ముందుకెళ్తోందని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఏఐ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీలో గుర్తింపు కోసం అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబాపూలే విగ్రహం పెట్టాలని ధర్నా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జైలుకు వెళ్లొచ్చిన తర్వాత గ్రాఫ్‌ను పెంచుకునే పనిలో పడ్డారని, బహుబలి సినిమాలో మహిశ్మతి సామ్రాజ్యానికి లేడీడాన్‌లా కవిత నిలవాలనుకుంటున్నారని విమర్శించారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ ఢిల్లీ నుంచి తెలంగాణకు ల్యాండ్ కాగానే  కేంద్ర మంత్రి నుంచి కార్పొరేటర్‌గా పరకాయ ప్రవేశం చేస్తారని, అవగాహన లేకుండా మాట్లాడుతారని విమర్శించారు. ఏదైనా మాట్లాడే ముందు దానిపై అవగాహన పెంచుకుని మాట్లాడాలని ఆయనకు సూచించారు.