calender_icon.png 4 April, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్రక్ప్ బిల్లుపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి

03-04-2025 05:10:07 PM

అధికారంలోకి వస్తే దేశానికి మంచి చేయటమే బీజేపీ పని..

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలోని ప్రతి బూత్ లో నిర్వహించాలి..

నరేంద్ర మోది కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలి..

బీజేపీ కార్యకర్తకి దేశం ప్రథమం, పార్టీ ద్వితీయం, ఆ తర్వాతే కుటుంబం..

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్..

కామారెడ్డి (విజయక్రాంతి): వ్రక్ప్ బిల్లుపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా పదాదికారుల సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశములోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా బీజేపీ నిన్న ప్రవేశపెట్టిన వ్రక్ప్ బిల్లుపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయనీ అన్నారు. ముస్లింలకు ఈ బిల్లు ద్వారా ఎలాంటి నష్టం జరగదని అన్నారు. అధికారంలోకి వస్తే దేశానికి మంచి చేయటమే బీజేపీ పని అని కేంద్రంలో బిజేపి ప్రభుత్వం అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందని అన్నారు.

ఈనెల 6న బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలోని ప్రతి బూత్ లో నిర్వహించాలనీ, ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జండా ఎగరవేయాలని అన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోది కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలనీ అన్నారు. బీజేపీ కార్యకర్తకి దేశం ప్రథమం, పార్టీ ద్వితీయం, ఆ తర్వాతే కుటుంభం అని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా మాజీ అధ్యక్షురాలు అరుణతార. ఎల్లారెడ్డి నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ బాణాల లక్ష్మారెడ్డి, రంజిత్ మోహన్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు విపుల్ జెన్ కామారెడ్డి పట్టణ బిజెపి అధ్యక్షులు మోటూరి శ్రీకాంత్ నియోజకవర్గంలోని బిజెపి పదాధికారులు పాల్గొన్నారు.