calender_icon.png 10 January, 2025 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిటీ చైర్మన్లపై విపక్షాల ఫోకస్

12-07-2024 12:51:44 AM

24 కమిటీల్లో 11 కావాలంటున్న ఇండియా కూటమి

సభ్యుల నిష్పత్తి ప్రకారం కేటాయింపు ఉండాలని స్పష్టం

న్యూఢిల్లీ, జూలై 11: పార్లమెంట్ వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తుంది. స్టాండింగ్, అడ్ హాక్ వంటి కమిటీలతో విధాన పరమై న నిర్ణయాలు, బిల్లులను ఈ కమిటీలు పరిశీలించి సభకు నివేదిస్తాయి. పార్టీలకు అతీతంగా సభ్యులను నియమిస్తారు.  గతం తో పోలిస్తే ప్రతిపక్ష కూటమికి ప్రస్తుతం అ త్యధికంగా 236 మంది సభ్యులు ఉన్నారు. గతం కంటే కమిటీల్లో ఎక్కువ సంఖ్యలో త మ సభ్యులు ఉండాలని ఇండియా కూటమి భావిస్తోంది. వర్షకాల సమావేశాల్లో భా గం గా కమిటీలను ప్రకటించే అవకాశముం ది. మొత్తం 24 ప్యానెళ్లలో ఆయా పార్టీల ఎ ంపీలను నామినేట్ చేయాలని కోరుతూ ఇ ద్దరు ప్రతిపక్ష నేతలకు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు లేఖ రాసినట్లు సమాచారం. 

మరో మూడు కేటాయించాలి..

లోక్‌సభ అధీనంలో 16 విభాగాలకు చెందిన స్టాండింగ్ కమిటీలు ఉండగా.. రాజ్యసభలో 8 స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి. ఈ 24 కమిటీల చైర్మన్లను నియామకం రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఇండియా కూటమి సీనియర్ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. ఈ సారి కనీసం అదనంగా మరో మూడు కమిటీల్లో తమ పార్టీలకు చెందిన సభ్యులను చైర్మన్లుగా ప్రకటించాలని భావిస్తున్నట్లు చెప్పారు. కాం గ్రెస్, తృణమూల్‌కు అదనంగా చెరో ప్యానె ల్ దక్కాలని, సమాజ్‌వాదీ పార్టీకి ఓ ప్యానె ల్ కేటాయించాలని కోరారు. 

సభ్యుల నిష్పత్తి ప్రకారం

ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమిలో 55 శాతం మంది చట్టసభ్యులు ఉండగా ప్రతిపక్షంలో 45 శాతం మంది ఉన్నారని, ఈ నిష్పత్తి ప్రకారం చైర్మన్లను కేటాయించాలని ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు. ఇలా చేస్తే 24 కమిటీల్లో 13 ఎన్డీయేకు , 11 ఇండియా కూటమికి దక్కుతాయి. 

ఎస్పీ, టీఎంసీకి అవకాశమివ్వాలి

గత ప్రభుత్వంలో కాంగ్రెస్ 3 స్టాండింగ్ కమిటీలకు చైర్మన్‌గా వ్యవహరించింది. కామర్స్, ఎన్విరాన్‌మెంట్, రసాయనాలు, ఎరువుల ప్యానెళ్లకు సా రథ్యం వహించింది. మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న తృణమూల్‌కు ఒక్క చైర్మన్ పోస్ట్ కూడా దక్కలేదు. ఎస్పీకి చెందిన రామ్‌గోపాల్‌యాదవ్‌కు తొలుత ఆరో గ్య శాఖ కమిటీ చైర్మన్‌గా అవకాశం లభించినా తర్వాత బీజేపీ ఎంపీకి బదిలీ అయింది. డీఎంకే ఎంపీ కనిమొళి గ్రామీణాభివృద్ధి కమిటీకి చైర్మన్‌గా ఉ న్నారు. ప్రస్తుతం రెండు సభల్లో కలిపి ఎస్పీకి 41 మంది ఎంపీలు, తృణమూల్‌కు 42 మంది ఉన్నారు. వీరికి కనీసంగా చెరొక చైర్మన్ స్థాయి కల్పించే అవకాశం ఉంటుంది.