హనుమకొండ,(విజయక్రాంతి): మహిళలపై భారం పడకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి గ్యాస్ సిలిండర్ పై రాయితీ ఇచ్చి ఆర్థికభారం తగ్గించామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చి ఆర్థికభారం తగ్గించామని, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగపడుతోందని మంత్రి కొనియాడారు. మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, ఆర్టీసీలో అద్దె బస్సులను కూడా మహిళలకే అప్పగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల మంది మహిళలను వ్యాపారులుగా మార్చాలనేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీతక్క వెల్లడించారు.