calender_icon.png 24 November, 2024 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మహా’ ఫలితాలను నమ్మలేం విపక్షాల విమర్శలు

24-11-2024 01:16:40 AM

ముంబై: మహారాష్ట్రలో మహాయుతి అఖండ విజయంపై శివసేన(యూబీటీ) అధినేత అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలున తాను అస్సలు ఊహించలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయన్నారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఎన్నికల ఫలితాల్లో తీవ్ర వ్యత్యాసం ఎలా సాధ్యమైందో అర్థం కావడం లేదన్నారు. ఫలితాలు ఎలా ఉన్నా మహారాష్ట్ర హక్కుల కోసం పోరాడతామని స్పష్టం చేశారు. 

ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు: రౌత్ 

ఎన్నికల ఫలితాలపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ తాము ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదన్నారు. ఎక్కడో తప్పు జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. గౌతమ్ అదానీపై ప్రజల దృష్టి మరల్చడానికి ఫలితాలను బీజేపీ తారుమారు చేసిందని ఆరోపించారు.  

ఫలితాలపై కాంగ్రెస్ రియాక్షన్

మహా ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ఫలితాలను సమగ్రంగా విశ్లేషించుకుంటామన్నారు. అలాగే రాజ్యాంగంతోపాటు నీరు, అడవులు, భూమిపై విపక్ష కూటమి సాధించిన విజయంగా జార్ఖండ్ ఫలితాలను అభివర్ణించారు. ఇండియా కూటమికి విజయాన్ని కట్టబెట్టిన జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 

మరోవైపు మహారాష్ట్ర ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా కుట్రలు పన్నారని ఆరోపించారు.  ఈ క్రమంలోనే జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ కొనసాగుతారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గులాం అహ్మద్ మీర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.