- అడ్డుకున్న పార్టీల భరతం పడతాం
- ఈనెల 6 నుంచి కులగణన చైతన్య సదస్సులు
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రారంభమయ్యే కులగణనలో భాగస్వామ్యం కాని పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రక టించి, వారిని రాజకీయంగా సమాధి చేయడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.
ఈనెల 6 నుంచి 20వ తేదీ వర కు రాష్ట్రవ్యాప్తంగా జరిగే కులగణన చైతన్య సదస్సుల వాల్ పోస్టర్‌ను ఇతర బీసీ సంఘాల నేతలతో కలిసి ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లాగానే బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కూడా కులగణనకు బేషరతుగా మద్దతు తెలిపి రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి కులగణనలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కులగణనపై ఎన్ని రోజులు మౌనం వహిస్తారని ప్రశ్నించారు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు నిర్వహించే చైతన్య సదస్సుల ద్వారా లక్షలాది మందిని భాగస్వామ్యం చేసి బీసీ కులాలకు కులగణన పట్ల పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు.
సర్వే కోసం రూపొందించిన ప్రశ్నావళిలో బీసీలకు కొన్ని సందేహాలున్నాయని, కుల సంఘాలు, మేధావులు లేవనెత్తుతున్న అంశాలపై ప్రభుత్వం ఎప్ప టికప్పుడు నివృత్తి చేయాలన్నారు. కులగణనపై ప్రత్యేకంగా నోడల్ ఏజెన్సీని నియమించాలని, రాష్ట్రవ్యాప్తంగా కులగణనపై వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు సచివాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. కులగణన పటిష్టంగా, శాస్త్రీయంగా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జరగడానికి సామాజిక నిష్ణాతు లు, రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ ఐఏఎస్‌లు, ప్రొఫెసర్లు, మేధావులతో కూడిన సలహామండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.