29-04-2025 12:00:00 AM
అడిషనల్ కలెక్టర్ అమరేందర్
బిజినేపల్లి, ఏప్రిల్ 28 : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా భూవివరాల్లో దొర్లిన తప్పుల సవరణ చేపట్టి క్రమబద్ధీకరించే అవకాశం ఉందని నాగర్కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్ శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు.
ధరణి చట్టం -2020లో భూవివరాల నమోదు తొలగింపులకు తహసీల్దార్, ఆర్జీవో, కలెక్టర్తో పాటు ఏఅధికారికి అధికారం లేకపోవడంతో చాలా వరకు సమస్యలు. పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంలో సవరణ, తొలగింపు, చేర్చుటకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అందుకు అవసరమైన రికార్డులతో పాటు మోక పంచనామా సర్టిఫైడ్ సర్వేయర్ తో చేయించి దృవీకరణ ఇవ్వాలన్నారు.
సాదాబైనామాలను పరిశీలించి నిజమైన హక్కుదారుడికి చట్టంలో పేర్కొన్న విధంగా క్రమబద్ధీకరణ చేపట్టి పాసుపుస్తకాలు మంజూరు చేయోవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు భూభారతి చట్టంపై అవగాహన కల్గి ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి అమలోకి రానున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఆర్టీవో సురేష్, డిప్యూటీ తహసీల్దార్ చిక్కుడు రవికుమార్, ఏవో నీతి, ఇన్చార్జీ ఎంపీవో మహేష్ నాయక్, రికార్డు అసిస్టెంట్ భగవంత్ సాగర్, ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, రేషన్ డీలర్లు, ఆశ కార్యకర్తలు, పీల్ అసిస్టెంట్లు, వివిధ రాజకీయ పార్టీల నాయక లు, మహిళ సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు.