calender_icon.png 21 January, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి

26-08-2024 02:06:39 AM

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 25(విజయక్రాంతి): వచ్చిన ప్రతి అవకాశాన్ని యువత అందిపుచుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రభుత విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో వేములవాడలోని మ హా లింగేశర గార్డెన్‌లో మెగా జాబ్ మేళా ను ఆదివారం నిరహించారు. ఈ మేళాను ఆయన  ప్రారంభించి మాట్లాడారు. రాష్ర్ట ప్రభుతం ఇప్పటికే గురుకుల విద్యాలయా ల్లో ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు.

ఇటీవల టీచర్ల నియామకానికి మెగా డీఎస్సీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష నిరహించి, కీ కూడా విడుదల చేసిందని తెలిపారు. అలాగే గ్రూప్ ఉద్యోగాల కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుందన్నారు. గ్రూప్  మెయిన్స్ నిరహణకు అ న్ని ఏర్పాట్లు చేస్తున్నదని వివరించారు. దా దాపు ఈ ఎనిమిది నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని వెల్లడించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే జా బ్ క్యాలెండర్ విడుదల చేసిందని గుర్తు చేశారు.

యువతకు ఉద్యోగావ కాశాలు కల్పించే అంశంపై పక్కా ప్రణాళికతో రాష్ర్ట ప్రభు తం ముందుకు వెళుతుందని తెలిపారు. హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నదని వివరించారు. ప్రభుత ఉద్యోగాలతోపాటుగా ప్రైవేటు కంపెనీల్లో యువతకు కొలువులు ఇప్పించేందుకు జాబ్ మేళాలు చేపడుతున్నదని పేర్కొన్నారు.  యువత వివిధ అంశాల్లో ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని పిలుపు నిచ్చారు. యువత ఉద్యోగాలు ఎక్కడ వచ్చినా వెళ్లాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత, తల్లిదండ్రులు భాగసామ్యులు కావాలని కోరారు. జాబ్ మేళాలు ప్రతి ఆరు నుంచి ఎనిమిది నెలలకు ఒక్కసారి నిరహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.