calender_icon.png 20 April, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశాలను అందిపుచ్చుకోవాలి

19-04-2025 12:00:00 AM

విద్యార్థులతో జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్18 (విజయక్రాంతి): రోజు రోజుకు మారుతున్న సాంకేతికతను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని డీఎస్‌ఓ కటుకం మధుకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని  శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించే సామాజిక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని 7 పాఠశాలల నుండి 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఓ మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ లో ముందుకు వెళ్ళాలని, మన చుట్టూ ఉన్న సమస్యలని గుర్తించి పరిష్కార మార్గా లు అన్వేశించాలని, దీనికి ప్రతి ఒక్కరూ టీం వర్క్ చేయాలని సూచించారు. మండల విద్యాశాఖ అధికారి రాథోడ్ సుభాష్ మాట్లాడుతూ శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల లో సమ్మర్ క్యాంప్‌కు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల విద్యార్థులను ఆహ్వానించడం ద్వారా సామాజిక అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు చిలువేరు వెంకటేశ్వర్, పాఠశాల కార్య దర్శి వేణుగోపాల్, నాగుల శ్రీనివాస్ , భోగ మధుకర్, జంజిరాల శ్రీనివాస్, ఇరుకుల్ల శ్రీనాథ్, కట్కూరి స్వాతి,మెంటర్ సాయికృష్ణ, పోలేపల్లి రాజశేఖర్, ట్రస్మ జిల్లా అధ్యక్షుడు  పి.దేవభూషణం, రాధా కృష్ణ చారి, ల్యాబ్ ఇంచార్జీ శ్రీకాంత్, ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.