27-03-2025 12:29:50 AM
-ఇంచార్జి రిజిస్ట్రార్ డా మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్ మార్చి 26 (విజయ క్రాంతి) : వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పీయు ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ డా మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజీ లో సెమినార్ హాల్ యందు లారస్ ల్యాబ్ వాళ్ళు ప్లేసెమెంట్ సెల్ ఆధ్వర్యంలో కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ కెమి స్ట్రీ, ఫార్మసీ చివరి సంవత్సరం విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధి గా హాజరైన ఇంచార్జి రిజిస్ట్రార్ డా మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ పరిశ్రమల కు అవసరమగు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో ప్లేసెమెంట్ అధికారి డా అర్జున్ కుమార్, లారస్ ల్యాబ్ ప్రతినిధులు, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విభాగధిపతి డా రవికుమార్ పాల్గొన్నారు.