calender_icon.png 24 November, 2024 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెల్లువలా అవకాశాలు

23-11-2024 12:00:00 AM

తెలుగు  ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ల పేర్లు మీనాక్షి చౌదరి, భాగ్యశ్రీ బోర్సే. ఇద్దరూ ఫాస్ట్‌గా టాలీవుడ్‌లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ముఖ్యంగా భాగ్యశ్రీకి అయితే అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడి ఖాతాలో సినిమాల లిస్ట్ చాంతాడంత ఉంది. రామ్ పోతినేని హీరోగా ప్రారంభం కాబోతున్న చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపికయ్యారు.

‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రేక్షకుల మనసు దోచేసింది. సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకున్నా అమ్మడికి మాత్రం బాగా కలిసొచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న మూవీలోనూ ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ కొట్టేశారు. ఈ పాన్ ఇండియా మూవీని రానా దగ్గుబాటి రూపొందిస్తున్నారు. ఆ తరువాత విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న మూవీలో సైతం భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

దీనితో పాటు నాని, సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో సైతం ఛాన్స్ కొట్టేశారట. ఈ మధ్యకాలంలో ఇంత స్పీడ్‌గా అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ భాగ్యశ్రీనే. త్వరలోనే అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజ్‌ను దక్కించుకోవడం ఖాయమని అంటున్నారు.