calender_icon.png 25 November, 2024 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్టీ ఉద్యోగులకు అన్ని స్థాయిల్లో అవకాశాలు

29-08-2024 04:29:49 AM

ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు28(విజయక్రాంతి): ఎస్టీ ఉద్యోగులకు అన్ని స్థాయిల్లో అవకాశాలు కల్పించాలని జాతీ య ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. బుధవారం ఎక్సైజ్ శాఖలోని ఎస్టీ ఉద్యోగుల సమస్యలు, సౌకర్యాలపై ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్టీ ఉద్యోగులకు అన్ని స్థాయిల్లో ప్రమోషన్లు, సౌకర్యాలు అందేవిధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి, జేసీ శాస్త్రీ, డీసీ జె హరికిషన్, ఏసీ ఆర్ కిషన్, బ్రూవరీస్ జీఎం అబ్రహాం, ఉద్యోగ సంఘం నాయకులు జీటీ జీవన్, గుగులోత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. 

ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

ఆలిండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఎక్సైజ్) నూతన కమిటీని సంఘం ఉద్యోగులు బుధవారం ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎక్సైజ్ రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, ప్రధాన కార్యదర్శిగా మేడ్చల్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్, ట్రెజరర్‌గా కే శ్రీనివాస్, కో ఆర్డినేటర్‌గా డీ తిరుపతి ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా మెదక్ డిప్యూటీ కమిషనర్ జే హరికిషన్, అడ్వయిజర్‌గా జాయింట్ కమిషనర్(డిస్లరీస్) సురేష్ ఎన్నికయ్యారు.