calender_icon.png 22 January, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశాలు అంత సులభంగా రాలేదు

13-08-2024 12:00:00 AM

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అభిమాన ధనాన్ని సంపాదించుకున్న అందాల భామ రష్మిక మందన్న. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచుకున్న ఈ అమ్మడు.. దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప: ది రైజ్’లోనూ అలరించనుంది. ఈ ఒక్కటే కాదు ఈ సొగసరి చేతిలో భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. బాలీవుడ్‌లో విక్కీ కౌశల్‌తో ‘చవ్వా’, సల్మాన్ ఖాన్‌తో ‘సికిందర్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. ఇక టాలీవుడ్‌లో పుష్ప రెండో భాగంతోపాటు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుబేర’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. స్టార్ హీరోయిన్‌గా ఇప్పుడు ఇంత బిజీగా గడుపుతున్న ఈ నేషనల్ క్రష్.. తనకు తొలినాళ్లలో అవకాశాలేవీ అంత సులభంగా రాలేదని చెప్తోంది.

అవకాశాల కోసం చాలా కష్టాలు ఎదుర్కొన్నా. కొన్ని ఆడిషన్స్‌కు వెళ్తే.. అసలు నటనకే పనికి రావంటూ ముఖం మీదే చెప్పేశారంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బుంగమూతి పెట్టుకుంది. ‘ఆడిషన్‌కు వెళ్లిన ప్రతిసారీ కన్నీళ్లతోనే ఇంటికి తిరిగి వచ్చేదాన్ని. ఒక సినిమా కోసమేతే పదే పదే ఆడిషన్‌కు పిలిచారు. చివరకు ఆ చిత్రం కోసం ఎంపిక చేశారు. రెండు మూడు నెలల పాటు ఆ సినిమా వర్క్‌షాప్స్ నిర్వహించారు.. ఆఖరికి ఆ ప్రాజెక్టే రద్దయింది. తర్వాత కూడా సుమారు ఓ ఇరవై ఐదు ఆడిషన్స్‌లో నన్ను రిజెక్ట్ చేశారు.

నా యాక్టింగ్‌పై వాళ్లకు ఎప్పుడూ అనుమానం ఉండేది. ఇలాంటి సవాళ్లు ఎన్నో ఎదురైనా, ఎప్పుడూ వెనక్కి తగ్గాలనుకోలేదు. ప్రతి సినిమాతోనూ నన్ను నేను మెగురుపర్చుకుంటూ వచ్చా. ఇప్పుడు నా సినిమాలు చూస్తూ ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేదనుకుంటూ ఉంటా’ అని చెప్పింది రష్మిక.