26-04-2025 08:32:04 PM
ఐఈడి పేలి జవాన్ కు తీవ్రగాయాలు..
చర్ల (విజయక్రాంతి): తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్టల కేంద్రంగా శనివారం 5వ రోజు సైతం ఆపరేషన్ భద్రతా బలగాలు కొనసాగిస్తున్నాయి. శనివారం ఉదయం 7 గంటల నుండి 4 వైమానిక దళ హెలికాప్టర్లు కనిపించాయి. ఇదిలా ఉండగా గలగం అడవుల్లో ఐఈడి పేలి జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం బీజాపూర్ తరలించారు. ఆకాశంలో హెలికాప్టర్ల నిరంతర కార్యకలాపాల కారణంగా ఒక ప్రధాన నవీకరణ ఆశించబడుతుందని చెబుతున్నారు.
శుక్రవారం రాత్రి 10 గంటల వరకు భారీ కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమీప గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ ఒక సున్నితమైన సందర్భంలో ఉందని ఇక్కడికి సమాచారం అందుతుంది. ప్రధాన చర్య ఉంటుందని భావిస్తున్నారు. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో హై అలర్ట్ విధించాయి. ప్రధానంగా పూజారి కాంకేరు భీమవరం పాడు, కస్తూరి పాడు, గుంజపర్తి, నంబి తదితర చోట్ల వ్యాపించి ఉన్న కర్రెగుట్టలపై ప్రధానంగా ఆపరేషన్ కొనసాగుతోంది.