calender_icon.png 20 January, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామకృష్ణ మఠంలో ఆపరేషన్ థియేటర్ ప్రారంభం

20-01-2025 12:00:00 AM

ముషీరాబాద్, జనవరి 19 : హైదరాబాద్ దోమలగూడలోని రామకృష్ణ మఠంలో వివేకానంద హెల్త్ సెంటట్‌లో మినీ ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ దవాఖానలలో ఖరీదైన చికిత్స పొందలేని పేద రోగులకు వివేకానంద హెల్త్ సెంటర్‌లో మైనర్ సర్జరీ సేవలను అం దించడానికి వీలుగా రోటరీ ఇంటర్నేషనల్, రోటరీ డిస్ట్రిక్ట్ 3150తో కలిసి రోటరీ క్లబ్‌లు రూ.30 లక్షల వ్యయం తో నిర్మించిన మినీ ఆపరేషన్ థీయేటర్‌ను రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద, రోటరీ డిస్ట్రి క్ట్ గవర్నర్ కాట్రగడ్డ శరత్ చౌదరి, డాక్ట ర్ శరత్ చౌదరి ఆదివారం ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో రోటరీ గ్లోబ ల్ ఛాంపియన్స్ చార్టర్ అధ్యక్షుడు ఆర్‌టీఎన్ నర్సింహ మేధ, యూఎస్‌ఏలోని రోటరీ క్లబ్ ఆఫ్ లివర్ మోర్ నుంచి లింగాగౌడ్, రోటరీ గ్లోబల్ ఛాంపియన్స్ అధ్యక్షుడు బీకే కర్ణ, కార్యదర్శి శ్రీనివాస్, అసిస్టెంట్ గవర్నర్ రాజహాన్స్ బంకా, జంటనగరాల రోటరీ క్లబ్ సభ్యులు, వివేకానంద హెల్త్ వైద్యులు పాల్గొన్నారు.