calender_icon.png 1 February, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల కార్మికుల విముక్తికే 'ఆపరేషన్ స్మైల్'

01-02-2025 07:31:35 PM

ఎస్పీ డివి శ్రీనివాసరావు...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్ -XI విడుతలో జిల్లా వ్యాప్తంగా 57 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం జిల్లాలో 02 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇందులో భాగంగా జనవరి 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్ -XI కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో 57 మంది బాలకార్మికులను గుర్తించడమైనదని తెలిపారు. ఇందులో 54 మంది బాలురు, 03 బాలికలు ఉన్నారని తెలిపారు.

ఆసిఫాబాద్ సబ్ డివిజన్ లో మొత్తం 21 మంది కాగా ఇందులో 21 మంది బాలురు, కాగజ్ నగర్ సబ్ డివిజన్ లో మొత్తం 36 మంది కాగా ఇందులో 33 మంది బాలురు, ముగ్గురు బాలికలు, జిల్లాలో మొత్తం  57  మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చిన్న పిల్లలను ప్రమాదకరమైన ప్రదేశాల్లో పనిలో పెట్టుకున్న యజమానులపై కేసు నమోదు చేసి బాలబాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. 14 సం. వయస్సు లోపు గల బాలబాలికలను ఎలాంటి పనులలో పెట్టుకోరాదని, అలాగే 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలను ప్రమాదకరమైన పనుల్లో పెట్టడం చట్టరీత్య నేరమని, బాలబాలికలని కార్మికులుగా ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. అలాగే ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు. ఆపరేషన్ స్మైల్ -XI లో భాగంగా బాల కార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించిన ప్రత్యేక బృందాల సభ్యులను ఎస్పీ అభినందించారు.