calender_icon.png 27 October, 2024 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగస్టు 2న ఆపరేషన్ రావణ్

04-07-2024 12:05:00 AM

రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఆపరేషన్ రావణ్’. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆపరేషన్ రావణ్‌” చిత్రాన్ని ఆగస్టు 2న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘ఓ సైకో స్టోరీ’ అనే క్యాప్షన్‌తో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్, రాకెట్ రాఘవ, రఘు కుంచె, తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం: శరవణ వాసుదేవన్, ఎడిటర్: సత్య గిద్దుటూరి, ఫైట్స్: స్టంట్ జాషువా, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.