calender_icon.png 27 October, 2024 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ ధూల్‌పేట్

10-08-2024 12:43:59 AM

  1. గంజాయి నిర్మూలన దిశగా ఎక్సైజ్ శాఖ అడుగులు 
  2. వరుసదాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న గంజాయి స్మగ్లర్లు 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల నిర్మూలన దిశగా ఎక్సైజ్ అధికారులు ఆపరేషన్ ధూల్‌పేట్ మొదలెట్టారు. ఎక్సైజ్ బృందాలు చేస్తున్న వరుస దాడులతో ధూల్‌పేట్‌లోని గంజాయి స్మగ్లర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆపరేషన్ ధూల్‌పేట్ పేరుతో గత 25 రోజుల నుంచి ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్, ఎస్టీఎఫ్ బృందాలతో పాటు పోలీ సులు నిత్యం ధూల్‌పేట్‌లో గంజాయి కోసం ఇంటింటి సోదాలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ ధూల్‌పేట్‌లో భాగంగా స్మగ్లర్లు, అమ్మకందార్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగస్టు 31వ తేదీ వరకు గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ఎక్సైజ్ యంత్రాంగం ముం దుకు సాగుతుందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెం ట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. 

నాటుసారా పోయి గంజాయి.. 

2016లో ధూల్‌పేట్‌లో నాటుసారా తయారీని నిర్మూలించడానికి ఎక్సైజ్ అధికారులు తీవ్ర కృషి చేశారు. దీంతో నాటుసారా కథ ముగిసింది. కానీ ధూల్‌పేట్‌ను మళ్లీ కొందరు అక్రమార్కులు గంజాయి అడ్డాగా మార్చారు. ధూల్‌పేట్ నుంచి గంజాయి నేడు హైదరాబాద్ మహానగరానికి మొత్తంగా అమ్మకాలు జరిపే స్థాయికి ఎదిగింది. 15 మందికిపైగా బిగ్ షాట్స్ ఈ వ్యాపారంలో రూ. కోట్లు గడించారు. మరో 20 మంది స్థానికంగా ఉండి ఇండ్లు, దుకాణాల ద్వారా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. 100 నుంచి 150 మంది గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మకాలు చేపట్టడం, డోర్ డెలివరీ చేసే స్థాయికి ఎదిగారు. ఈ వ్యాపారంలో పురుషుల కంటే మహిళలే ముందుండి అమ్మకాలు జరపడం కొసమెరుపు. గంజాయి సరఫరా చేసే 15 మందిలో ఆరుగురిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అధికారులకు అడ్డంకులు సృష్టిస్తూ..

ఎక్సైజ్ దాడులతో సతమతమవుతున్న గంజాయి అమ్మకందారులు ఊపిరి సలుపక ఎక్సైజ్ పోలీసులను కట్టడి చేయడానికి, ఎదురు తిరగడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరో పక్క పగలు, రాత్రి అనే తేడా లేకుండా దాడులు నిర్వహిస్తున్నారని, మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని లీగల్ నోటీసులు పంపించడం వరకు వెళ్లారు. గంజాయి అమ్మకాలపై ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపడంతో ఏమీ చేయలేని స్థితిలో చాలామంది బిగ్ షాట్స్ ధూల్‌పేట్‌ను విడిచిపెట్టి వెళ్లారు. మరోచోటి నుంచి గంజాయి అమ్మకాలు సాగిస్తున్నా కూడా అక్కడ కూడా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి గంజాయి అమ్మకాలను అడ్డుకుంటూ ఉండడంతో ఏమి చేయాలో తోచని స్థితిలో ఎదురు తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు.  ఆపరేషన్ ధూల్‌పేట్‌లో భాగంగా 25 రోజుల్లో నిర్వహించిన సోదాల్లో 54 కేసులు నమోదు చేశామని ఎక్సైజ్ సీఐలు మధుబాబు, గోపాల్ తెలిపారు. 92 కిలోల గంజాయి, 12 వాహనా లను స్వాధీనం చేసుకోవడంతో పాటు 26 మందిని బైండోవర్ చేశామన్నారు. గంజాయి అమ్మకాలు చేపట్టే వారి వివరాలను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. 

గంజాయిని అరికట్టడమే లక్ష్యం.. 

ధూల్‌పేట్‌లో పూర్తి గా గంజాయి, డ్రగ్స్, నాటుసారాను నిర్మూలించే దిశగా పని చేస్తున్నాం. గంజా యి, డ్రగ్స్ వలన యు వత భవిష్యత్తు ఎంతో నష్టపోతుంది. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల యాజ మా న్యాలు ఎక్సైజ్ పోలీసులకు సహకరించాలి. ధూల్‌పేట్‌లో చాలామంది గం జాయి అమ్మ కందార్లు, ఇంటింటికి చేరవేసే వారి వివరాలు సేకరించాం. గంజా యి, డ్రగ్స్ అమ్మకాలు చేపట్టేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. 

 కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్