calender_icon.png 6 April, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోశలో బొద్దింక..

05-04-2025 07:40:23 PM

- ఇబ్రహీంపట్నం రాఘవేంద్ర హోటల్ లో ఘటన

- అపరిశుభ్ర వాతావరణంలో హోటల్స్ నిర్వహణ

- ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లోపంతో విచ్చలవిడిగా హోటల్స్ ల నిర్వహణ..

ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): దోశ తింటుండగా అందులో బొద్దింక ప్రత్యక్షమైన ఘటన ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు హన్మంత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన హన్మంత్ తన పిల్లలతో టిఫిన్ చేసేందుకు ఇబ్రహీంపట్నంలోని శ్రీ రాఘవేంద్ర హోటల్ కి వెళ్లి దోషాలు ఆర్డర్ చేశాడు. పిల్లలు తింటున్న దోశలో బొద్దింక రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దింతో యాజమాన్యాన్ని నిలదీయగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితులు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కి సమాచారం ఇచ్చారు. వెంటనే మున్సిపాలిటీ ఎన్విరాంల్మెంటల్ ఇన్స్పెక్టర్ ప్రణవ్, సానిటరీ ఇన్స్పెక్టర్ సాయి హోటల్ ను సందర్శించి రూ.2500/- ఫెనాల్టీ విధించారు. 

ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయంజాల్ లోని తులసి గ్రాండ్ హోటల్ లో కుళ్ళిన మాంసాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.. అది మరువక ముందే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో.. హోటల్స్ కి వచ్చే భోజన ప్రియుల్లో ఆందోళన మొదలయ్యింది. మంగల్ పల్లి, ఆదిభట్లలో విచ్చల విడిగా హోటల్స్ ఉన్నాయి. వీటిలో చాలా వరకు ట్రేడ్ లైసెన్స్ లేకుండానే నడుపుతున్నారు.

ధనార్జనే ధ్యేయంగా హోటల్స్ నిర్వాహకులు పైన పటారం.. లోన లోటారం. అన్నట్లుగా హోటల్స్ బయట నుంచి సుందరంగా ముస్తాబు చేసి, నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపరిశుభ్రమైన ఆహారంతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తే మరిన్ని ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, కానీ ఫుడ్ సేఫ్టీ అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయని, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించే హోటల్స్ ను సీజ్ చేయాలని కోరుతున్నారు.