27-03-2025 12:00:00 AM
చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన కలెక్టర్
ఖమ్మం; మార్చి 26: నిబంధనలకు విరుద్ధంగా ఖమ్మం జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ నిర్వహణ కొనసాగుతోందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కు వినతిపత్రం సమర్పించింది. ఐడీవోసీలో కలెక్టర్ ను బుధవారం కలిసి టీడబ్ల్యూజేఎఫ్ నేతలు వినతిపత్రం సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ క్లబ్ ను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
ఎలాంటి లెక్కాపత్రం లేకుండా... ఆడిటింగ్ లు జరపకుండా దీనిని అడ్డగోలు వేదికగా మార్చారని ఫిర్యాదు చేశారు. క్లబ్ లో జవాబుదారీతనం లోపించిందన్నారు. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ రుసుం వసూళ్లలో అనేక లోటుపాట్లు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రెస్ క్లబ్ సభ్యత్వాలు ఇచ్చి ప్రభుత్వ అధికారి ద్వారా ఎన్నిక నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
అప్పటి వరకూ అడ్ హక్ కమిటీని ఏర్పాటు చేసి ఇకనైనా ప్రెస్ క్లబ్ నిర్వహణ సవ్యంగా సాగేలా చూడాలని కోరారు. ప్రెస్ క్లబ్ ఆడిటింగ్ లోపాల పైనా ప్రభుత్వ అధికారి ద్వారా విచారణ చేయించాలని విన్నవించడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు, సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, ఆవుల శ్రీనివాస్, వేగినాటి మాధవరావు, మానుకొండ రవికిరణ్, షేక్ జానీపాష, సుభాని, మేగా దేవేందర్, అర్షద్, యాకుబ్ పాష తదితరులు పాల్గొన్నారు.