మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలోవ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ ఆవరణలో మంగళవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ సూపర్వైజర్ రామ్ చందర్ సొసైటీ కార్యదర్శి బాబురావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే కందులు విక్రయించి క్వింటాలుకు రూ.7,550 మద్దతు ధర పొందాలన్నారు.
రైతులకు సూచనలుచేస్తూ... రైతులు తమ సరుకులను నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్నాయో లేదా చూసుకొనవలెను సరుకులు అమ్మడానికి తెచ్చేముందు తమ సరుకులను నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్నాయో లేదా చూసుకొనవలెను రైతులు లేకురాలు అమ్మడానికి తెచ్చెముందు తాలు గింజలు కల్తీగింజలు, పొట్టు ఇతర పదార్థాలు లేకుండా శుభ్రపరిస్తే సరుకు నాణ్యత పెరిగి అవించిన ధర రావడానికి అవకాశం ఉంటుంద న్నారు.రైతు తప్పనిసరిగా తీసుకురావలసిన గుర్తింపు పత్రాలు1.పట్టాదారు పాసుపుస్తమకు జీరాక్స్ 2.బ్యాంక్ పాస్బుక్ జీరాక్స్ 3.ఆధార్ కార్డు జీరాక్స్, వ్యవసాయ అధికారి పోర్టల్ లో ఉన్న రైతుల ధృవీకరణ పత్రము ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి బాబురావు పటేల్, మార్కెట్ కమిటీ సూపర్వైజర్ రామ్ చందర్, వ్యవసాయ శాఖ ఏ ఈ ఓ సౌమ్య సొసైటీ సిబ్బంది విట్టల్ రైతులు తదితరులు పాల్గొన్నారు.