జ్యోతి ప్రజ్వలన చేసిన సినీతార సంయుక్త మీనన్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): మహానగరంలోని నార్సింగిలో మాంగళ్య షాపింగ్‌మాల్ యాజమా న్యం 21వ స్టోర్‌ను శుక్రవారం సినీనటి సంయుక్త మీనన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె షాపింగ్ మాల్‌లో కలియదిరిగి సందడి చేశా రు. వేడుకలో డైరెక్టర్లు పి.ఎన్‌మూర్తి, కాసం నమఃశివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పన్నెండేళ్లుగా మన్ననలు పొందు తూ 21 స్టోర్‌లు ప్రారంభించామన్నారు. ఆదివారం మణికొండ, త్వరలో కర్ణాటకలో తమ స్టోర్లను ప్రారంభిస్తామన్నారు.