calender_icon.png 3 March, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత కుట్టు మిషన్ కేంద్రం ప్రారంభం

02-03-2025 07:26:27 PM

మంచిర్యాల (విజయక్రాంతి): విశ్వహిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో నస్పూర్ లోని రిటైర్డ్ మెంట్ కాలనీలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ కోమాల రాజేందర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలు ఆర్థికంగా అభివృద్ధి జనాలకు ఏర్పాటుచేసిన ఈ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాతృశక్తి ప్రాంత సహ సంయోజిక సద్ది శ్రీవాణి, పరిషత్ జిల్లా కార్యదర్శి వేముల రమేష్, జిల్లా ఉపాధ్యక్షురాలు గొట్టిపతి కనకతార, నగర కార్యదర్శి కొండపర్తి సంజీవ్, సహ కార్యదర్శి సాగర్ తదితరులు పాల్గొన్నారు.