calender_icon.png 20 September, 2024 | 3:04 AM

మరికొన్ని గంటల్లో పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు

26-07-2024 08:07:13 PM

పారిస్: పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు మరికొన్ని గంటల్లో సెన్ నదిపై ప్రారంభం కానున్నాయి. వందేళ్ల తర్వాత ఒలింపిక్స్ కు ఫ్రాన్స్ ఆతిథ్యమిస్తుంది. 'గేమ్స్ వైడ్ ఓపెన్ నినాదం'తో పారిస్ ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి సెన్ నది వేదికగా శుక్రవారం రాత్రి 11 గంటలకు పారిస్ ఒలింపిక్స్  ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి. 6 కిలోమీటర్ల పొడవుగా 100 పడవల్లో 205 దేశాల క్రీడాకారుల పరేడ్ జరుగనుంది. ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో 3 వేల మంది కళాకారుల ప్రదర్శనలు, 3.20 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది.  

ఈ పారిస్ ఒలింపిక్స్ లో మొత్తం 32 క్రీడాంశాలు, 329 స్వర్ణ పతకాలు ఉంటాయి. పారిస్ ఒలింపిక్స్ నిర్వహణకు సుమారుగా రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రికార్డుస్థాయిలో దాదాపు కోటి టికెట్లు విక్రయించినట్లు సమాచారం. రెండంకెల పతకాలే లక్ష్యంగా పారిస్ ఒలింపిక్స్ బరిలో 117 మంది భారత అథ్లెట్లు పాల్గొంటున్నారు. నీరజ్ చోప్రా, నిఖత్ జరీన్, లవ్లీనా, అమిత్ పంగాల్, మీరాబాయి, పి.వి. సింధు, ఫొగాటే, చిరాగ్-సాత్విక్ జోడీపై భారత్ ఆశలు పట్టుకుంది.