calender_icon.png 1 March, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసమర్థ ప్రభుత్వానికి కళ్లు తెరిపించు

31-01-2025 12:00:00 AM

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నిరసన
  • గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు

మెదక్, జనవరి 30(విజయక్రాంతి) ః కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిరసనగా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం నాడు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు మెదక్ జిల్లా వ్యాప్తంగా  గాంధీ విగ్రహానికి వినతిపత్రాలు అందించి నిరసన వ్యక్తం చేశారు.

మెదక్ జిల్లా కేంద్రంలో రాందాస్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మె ల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమి టీ చైర్మన్ లు జగపతి కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ , పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయు లు నాయకులతో కలసి మహాత్మ గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెం ట్ ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపు మేరకు జనవ రి 30 నాటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 హామీల అమలులో పూర్తిగా విప్లమైంది కాబట్టి గాంధీ గారి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భం గా పద్మాదేవేందర్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ  మోసపూరిత వాగ్దానాల తో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తున్నారని, ఎన్నికల్లో పంచిన గ్యారెంటీ కార్డుకు, ఇచ్చిన 420 హామీలకు పాతరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెళ్లదీస్తున్నా రని విమర్శించారు. దేశానికి వెన్నుముక అయిన రైతుకు తెలంగాణలోని రేవంత్ సర్కారు వరుస వెన్నుపోట్లు పొడుస్తోంది.

రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని నమ్మబలికి ఏడాదిపాటు ఊరించి ఊరించి చివరికి 6 వేలే ఇస్తామని ఉసూరుమని పించిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ కన్వీనర్ తాజా మాజీ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కో-కన్వీనర్లు కృష్ణ గౌడ్, లింగారెడ్డి, జుబేర్ అహ్మద్, మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్లు బీమరి.

కిషోర్ జయరాజ్, సుంకయ్య, మాజీ కౌన్సిలర్ చంద్రకళ, రబీ దివాకర్, మెదక్, హవెలిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు ఎం.అంజాగౌడ్,సిహె.శ్రీనివాస్‌రెడ్డి, నాయ కులు ప్రభు రెడ్డి, మోచి. కిషన్, పాపయ్య, రాజు, శంకర్, చంద్రశేఖర్ గౌడ్, మధు, బట్టి. ఉదయ్, శ్రీకాంత్, సంతోష్, ఫాజిల్, అరుణ్, సాయిలు, సాయ గౌడ్, మోహన్, శ్రీనివాస్ గౌడ్, బాలయ్య, శ్రీధర్ రెడ్డి, కిర ణ్, వినయ్,రంజిత్, చాంద్ పాషా, నర్సిం లు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో గాంధీ వర్ధంతితో పాటు వినతిపత్రాలు అందజేశారు.