calender_icon.png 10 January, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనువిప్పు కావాలి

23-08-2024 12:00:00 AM

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి 18 మంది మృతి చెందడంతో పాటు మరో 40 మంది దాకా గాయపడ్డం దిగ్భ్రాంతి కలిగించింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఘటనాస్థలంతో పాటుగా ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సందర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి హామీ ఇచ్చారు అంతేకాదు మృ తుల కుటుంబాలకు కోటి పరిహారాన్ని కూడా ప్రకటించారు. అ యితే ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యం దీనికి కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో  ఎ ల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీల్లో సేఫ్టీ చర్యలకు సంబంధించి అధికారులు చేసిన సిఫార్సులను యాజమా న్యం పట్టించుకోలేదని అంటున్నారు.  అన్ని కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చేసి న సూచనను వెంటనే అమలు చేయాలి. తెలంగాణలోని కంపెనీ ల్లో భద్రతా చర్యలపై కూడా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

టి. రామదాసప్ప నాయుడు, నాగారం