20-04-2025 06:30:30 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సార్వత్రిక విద్యాశాఖ ఆధ్వర్యం(Department of Universal Education)లో ఓపెన్ ఇంటర్ పదవ తరగతి పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 464 మంది విద్యార్థులకు గాను 382 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, పరీక్షల సహాయ కమిషనర్ పరమేశ్వర్ తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పరిశీలించారు.