29-04-2025 01:02:30 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగిన బిసి డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిసి హక్కుల పోరాట సమితి నాయకులు బహిరంగ లేఖను మంగళవారం పంపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న హామీలను మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు, ఐదు సంవత్సరాలలో బిసిల సంక్షేమానికి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయింపు, అన్నీ జిల్లా కేంద్రాలలో బిసి భవనాల నిర్మాణం, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ప్రభుత్వం బిసి సమాజం ముందు దోషిగా నిలబెడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి హక్కుల పోరాట సంఘం నాయకులు పాల్గొన్నారు.