calender_icon.png 24 October, 2024 | 7:05 PM

ప్రజలకు పోలీసులు అందించే సేవలు మరువలేనివి

24-10-2024 04:50:22 PM

మంథని,(విజయక్రాంతి): ప్రజల కు పోలీసులు అందించే సేవలు మరువలేనివని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా గురువారం మంథని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,  పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఏసిపి, సీఐ రాజు, ఎస్ఐ రమేష్ లతో కలిసి పోలీసులు అందించే వివిధ సేవలను విద్యార్థులకు తెలియజేశారు. పోలీస్ స్టేషన్ లోని  రిసెప్షన్ వ్యవస్థ, కేసు డైరీలు, హిస్టరీ షీట్స్,స్టేషన్ లాకప్, స్టేషన్ లో ఉపయోగించే ఆయుధాలు, డయల్ 100 వ్యవస్థ పనిచేయు విధానం, పోలీసుల ముఖ్య విధులు, పోలీస్ యూనిఫాం, ట్రాఫిక్ రూల్స్, నూతన చట్టాలు ఇతర అంశాల పైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే పోలీసులు రోజువారి విధుల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే కమ్యూనికేషన్ విధానం గురించి వివరించి, విద్యార్థులచే పోలీస్ కంట్రోల్ రూమ్ చేత మాట్లాడించారు. ఈ సందర్బంగా విద్యార్థులు పోలీసు వ్యవస్థపై  ఆసక్తి వ్యక్తపరిచారు. పోలీస్ వ్యవస్థ పనితీరు గురించి తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మల్లయ్య, హెడ్ కానిస్టేబుల్ తో పాటు కానిస్టేబుల్స్,  సిబ్బంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.