calender_icon.png 27 September, 2024 | 4:56 AM

ఓపెన్ ఏఐ సీటీవో రాజీనామా

27-09-2024 03:07:12 AM

ఆరున్నరేళ్ల ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ఇటీవలి కాలంలో  ఏఐ(ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్) ఎంత వేగంగా అభివృద్ధి చెందు తుందో అంతా చూస్తూనే ఉన్నాం. మైక్రోసాఫ్ట్ మద్దతు ఉన్న  ఓపెన్ ఏఐ సంస్థ సీటీవో (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్) పదవికి మీరా మురాఠి, మరో ఇద్దరు సీనియర్ ఉద్యోగులు బాబ్, బారెట్ రాజీనామా చేశారు. వీరి రాజీనామా పై సంస్థ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ స్పందిస్తూ.. ఇన్నేళ్లు సంస్థలో పనిచేసి సంస్థ అభవృద్ధికి తోడ్పాటు నందించిన మీరా మురాఠికి కృతజ్ఞతలు తెలి పారు.  ఈ సందర్భంగా మీరా ఎక్స్ లో ఈ విధంగా స్పందించారు.

‘ఒకరు ఎంతో ఇష్టపడే ప్రదేశం నుంచి వైదొలగడానికి అనువైన సమయం అనేది ఎన్నటికీ రాదు.. అయినప్పటికీ నేను ఓపెన్ ఏఐ నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయం’ అని భావిస్తున్నాను అని తెలిపింది. కాగా 2017లో మీరా ఓపెన్ ఏఐ కంపెనీలో ఓ సాధారణ ఎంప్లాయిలా జాయిన్ అయి అంచెలంచెలుగా ఎదిగారు. ఓపెన్ ఏఐకి ముందు ఆమె వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాల్టీ స్టార్టప్ మోషన్, టెస్లాలో పనిచేశారు.