మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని అశ్వాపురంలో గల హెవీ వాటర్ ప్లాంట్ నందు నిర్వహించిన ఆప్ సైడ్ ఎమర్జెన్సీ డ్రైవ్ ను బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. గౌతమి నగర్ కాలనీ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ఆఫ్ సైడ్ ఎమర్జెన్సీ డ్రైవ్ ను ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. హెవీ వాటర్ ప్లాంట్ ప్రభావిత ప్రాంత ప్రజలకు అప్ సైడ్ ఎమర్జెన్సీ డ్రైవ్ పై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని, ఎలాంటి దుష్పరిణామాలు సంభవించకుండా సరైన జాగ్రత్తలు పాటించాలని, విషవాయువులు వెలువడినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు మహిళలకు రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం కలెక్టర్ హెవీ వాటర్ ప్లాంట్ ను సందర్శించి ప్లాంట్ పని తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెయింటినెన్స్ మేనేజర్ రాపిక్ అహ్మద్, జనరల్ మేనేజర్ శర్మ, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి వేణు, తహశీల్దార్ అరుణ, ఎంపీడీవో వరప్రసాద్, సిఐ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.