21-02-2025 12:00:00 AM
బైక్‌పై ఇద్దరు యువకుల సాహస యాత్ర.. 22 గంటలు ...1150 కిలోమీటర్లు
పటాన్‌చెరు, ఫిబ్రవరి 20: మహా కుంభమేళాకు వెళ్లాలను కొన్న కొంత మంది స్నేహితులు తీరా సమయంలో వెనకడుగు వేశారు. బస్సులో వెళదామంటే సమయం లేదు. కార్లలో వెళదామంటే ప్రయాగ్ రాజ్ వెళుతున్న వాహనాలతో ట్రాఫిక్ సమస్య...ఎలాగైన ప్రయాగ్ రాజ్ వెళ్లాలన్న తపన.
దీంతో బైక్‌పై వెళ్లేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు యువకులు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామానికి చెందిన బొగురు లక్ష్మన్, సంబరబోయిన సాయికుమార్ ఇద్దరు యువకులు ఈనెల 18న మద్యాహ్నం ఒంటి గంటకు ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు బయలుదేరారు.
నర్సాపూర్ సమీపంలోని చాకరిమెట్ల ఆంజనేయస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. 19 సాయంత్రం వరకు 22 గంటల్లో 1150 కిలోమీటర్లు ప్రయాణించి క్షేమంగా ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. పుణ్య స్నానాలు, ఆలయ దర్శనాలు ముగించుకొని 20వ తేదీ మద్యాహ్నం తిరుగు ప్రయాణం అయ్యారు.