calender_icon.png 25 November, 2024 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీలక్ష్మికి ఊంజల్ సేవ

28-09-2024 12:03:15 AM

- యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి) : యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం అర్చకులు శ్రీలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలో పుష్పార్చన, కుంకుమార్చన చేశారు. సాయంత్రం అమ్మవారిని పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అలంకరిం చారు. వేదమంత్రోచ్ఛణ, మంగళవాద్యాల నడుమ తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం హారతులతో నివేదించి ఊంజల్ సేవ చేశారు. కాగా, ఒక్కరోజే ఆలయానికి వివిధ కైంకర్యాల ద్వారా రూ.8.48 లక్షల ఆదాయం సమకూరింది.