calender_icon.png 29 November, 2024 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవ

18-05-2024 01:51:39 AM

లక్ష్మీనృసింహులకు నిత్యకల్యాణం

స్వామివారి నిత్యాదాయం రూ. 32.45లక్షలు

యాదాద్రి భువనగిరి, మే 17 (విజయక్రాంతి) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ సన్నిధిలో శుక్రవారం ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవ, లక్ష్మీనృసింహులకు నిత్యకల్యాణోత్సవం ఆగమ శాస్త్రరీతిలో ఘనంగా జరిగాయి. ప్రధానాలయంలో ఆండాల్ అమ్మవారిని పట్టువస్త్రాలు, ముత్యాల బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్య మనోహరంగా అలంకరించారు.

మహిళలు కుంకుమార్చనలు జరుపగా సాయంత్రం అమ్మవారిని మంగళ వాయిద్యాలు, వేద మంత్ర పారాయణాలతో తిరువీధుల్లో ఊరేగిస్తూ అద్దాల మండపంలో ఊయలలో అధిష్టింప చేశారు. లక్షనామ స్త్రోత్ర పారాయణాలతో అమ్మవారికి హారతులు నివేదిస్తూ ఊంజల్ సేవను కనులవిందుగా నిర్వహించారు. ఉత్సవ మండపంలో హోమ పూజలు జరిపి నిత్యకల్యాణం శాస్త్రోకక్తంగా చేశారు. కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారి ఆదాయం రూ. 32.45లక్షలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి శుక్రవారం భక్తుల నుంచి రూ. 32,45,945 లక్షల ఆదాయం వచ్చినట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి భాస్కర్‌రావు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 1,15,000, కైంకర్యాల ద్వారా రూ.1400, సుప్రభాత దర్శనాల ద్వారా రూ. 9,100, బ్రేక్ దర్శనాల ద్వారా రూ. 1,90,500, వ్రత పూజల ద్వారా రూ. 97,600, వాహన పూజల ద్వారా రూ. 4,700, వీఐపీల దర్శనాల ద్వారా రూ. 3,75,000, ప్రచార శాఖ ద్వారా రూ. 23,279, పాతగుట్ట ద్వారా రూ. 27,170, కొండపైకి వాహన ప్రవేశాల ద్వారా రూ. 3,35,500, యాదరుషి నిలయం ద్వారా రూ. 1,25,780, సువర్ణ పుష్పార్ఛనల ద్వారా రూ. 73,200, శివాలయం ద్వారా రూ. 17,500, పుష్కరిణీ ద్వారా రూ. 1,250, ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 13,26, 560, కల్యాణ కట్ట ద్వారా రూ. 90,000, ఆలయ పునరుద్ధరణ నిధి రూ. 4,000, లాకర్స్ రూ. 440, లీజుల ద్వారా రూ. 4,05,070, అన్నదానం ద్వారా రూ. 22, 896 ఆదాయం వచ్చినట్టు ప్రకటించారు.