హుజూర్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ పంచాయతీ సెక్రటరీ జిల్లా ఫోరం అనుబంధం సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన పిడమర్తి ఇంద్రబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ టోన్ హాల్ నందు డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు తన మిత్ర బృందంతో ఇంద్ర బాబు కు శాలువాతో పూల బొకేతో ఘనంగా సన్మానించారు .
ఈ సందర్భంగా దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ... చిన్ననాటి మిత్రుడు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఇంద్ర బాబు మంచి మనసు, మృదు స్వభావి తోటి వారు ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి. సేవ గుణం కలవాడు అని ఇటువంటి మంచి మనసున్న మా ఇంద్ర బాబు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బుల్లెద్దు అరుణ్, పాశం నరసింహారావు, ఇట్టి మల్ల వినోద్, కామల్ల రాజా,నూక తొట్టి ప్రమోద్, తాళ్ల ప్రసాద్, లచ్చి మల్ల హరీష్, ఉండేటి కిషోర్, కోల్లపూడి ఇస్సాక్, చుట్ట గొల్ల నాగేందర్, శ్రీధర్, శ్రీనివాస్, విజయ్ సారధి, తదితరులు పాల్గొన్నారు.