ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంపై అవగాహన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి డి ఇందిరా
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించగలమని సీనియర్ సివిల్ జడ్జి డి ఇందిరా అన్నారు. మంగళవారం ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళ డిగ్రీ అండ్ పీజీ అటానమస్ కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని కళాశాలలో ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిపై ముందస్తు జాగ్రత్తలు నివారణ పద్ధతు లు అనే అంశంపై అవగాహన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడుతూ భారత శ్రేయస్సు యువత మీద ఆధారపడి ఉందని,సమాజానికి క్యాన్సర్ మీద అవగాహన కల్పించి దాని యొక్క నివారణకు కషి చేయగల సామర్థ్యం నేటి యువతలో ఉందన్నారు. తొలి దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే దాన్ని జయించవచ్చని ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండి దానిని తరిమి కొడదామని విద్యార్థినులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి రాజేంద్రప్రసాద్, రిసోర్స్ పర్సన్ డాక్టర్ బిళ్ళ కంటి రాజ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. పద్మ అనురాధ, అమీనా ముంతాజ్ జహాన్, వాసంతి పాల్గొన్నారు.