calender_icon.png 8 April, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారు

08-04-2025 12:00:00 AM

కలెక్టర్ వెంకటేశ్ దోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 7(విజయ క్రాంతి): బాలికలు సకాలంలో పోషక ఆహారం తీసుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల ఉన్నత పాఠశాలలో మహిళ, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పింకీస్ ఫౌండేషన్ సహకారంతో నవి సమ్మన్ ప్రాజె క్టు కింద ఏర్పాటు చేసిన బాలికలకు సానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్, పింకీ స్ ఫౌండేషన్ మేనేజర్ భార్గవి బట్నగర్, కార్యదర్శి పండిట్ శాలిని గుప్తా, అధ్యక్షులు అరుణ్ గుప్తాలతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల ని, సకాలంలో పౌష్టికాహారం తీసుకోవడం తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు లో, క్రీడారంగంలో, ఎంచుకున్న రంగాలలో రాణించవచ్చని తెలిపారు. పింకీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని 35 పాఠశాల లను సానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు.

విద్యార్థినులు ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ధ్య సూత్రాలను పాటించాలని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువులో రాణించాలని తెలిపారు.  ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి కలెక్టర్ వెంకటేష్ దోత్రే జిల్లాలోని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజలు అందజేస్తున్న సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారు లు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.