calender_icon.png 2 April, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలిసికట్టుగా ఉంటేనే..ఏదైనా సాధించగలం

29-03-2025 12:54:08 AM

రాజకీయంగా ఇంకా రాణించాల్సి ఉంది

మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్

ఎల్బీనగర్, మార్చి 28 : వైశ్యులు ఎక్కడ ఉంటే... ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని, కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలం అని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నా రు. తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ మహిళా విభాగ్ మహాసభ మహిళా మహోత్సవం నాగోల్ లోని పీఎంఆర్ కన్వెన్షన్ లో శుక్రవారం నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ ఉప్పల  శారద,  జనరల్ సెక్రటరీ కాచం సుష్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సభ్యుడు సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాడి లక్ష్మీనారాయణ,వీ 3ఛానల్, విశ్వంభర దినపత్రిక , కాచం ఫౌండేషన్ అధినేత కాచం సత్యనారాయణ గుప్తా, స్టేట్ ఉమెన్స్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, ఇండియన్ కూచిపూడి ఎక్స్పోనెంట్ అండ్ మ్యూజిక్ టీచర్ పద్మజా రెడ్డి, ప్రముఖ గాయని కౌసల్య తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ఇంటికి ఇల్లాలే అందం అన్నట్టుగా, మహిళ బాగుంటేనే సమాజం బాగుంటుందని సమాజంలో మహిళ కీలక పాత్ర పోషిస్తుందన న్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి ముందుకెళ్లాలని సూచించారు. ఒక సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం అన్నట్టుగా ఒక మహిళ విద్యావంతురాలై సమాజం కోసం తోడ్పడుతూ అనేక వేల మందిని ప్రోత్సహిస్తూ వారిని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా శక్తివంతమైన మహిళ అని అన్నారు.

అనంతరం మహిళల ఫ్యాషన్ షో  అందరిని అలరించింది. మహిళలను ఉత్సాహపరచడానికి తంబోలా ఆటలు నిర్వహించారు.  కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ అడిషనల్ జనరల్ సెక్రటరీ సామ్రాజ్యలక్ష్మి, మాజీ ప్రెసిడెంట్ అంబాల లక్ష్మీ భవాని, రాయపూడి తిరుమలేశ్వరిపాల్గొన్నారు.