calender_icon.png 21 March, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ జెండా మోసిన వారికే పదవులు పట్టం...

20-03-2025 08:29:06 PM

పార్టీలో ఉండి కోవర్టులుగా పని చేస్తే సహించేది లేదు... 

పార్టీ వీడి వెళ్లిపోవాలంటే వెళ్లిపోవచ్చు... 

ప్రజల అవసరాలకు నేరుగా తననే కలవాలి...

మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...

ఖానాపూర్ (విజయక్రాంతి): కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని జండా మోసిన వారికే పదవులు కట్టబెడతామని, పార్టీలో ఏ కార్యకర్తకు అన్యాయం జరగనివ్వనని, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పటేల్ అన్నారు. గురువారం ఖానాపూర్ మార్కెట్ యార్డులో నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల, ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ముందుగా మార్కెట్ కమిటీ చైర్మన్, పడగల భూషణ్, వైస్ చైర్మన్ మజీద్, కమిటీ డైరెక్టర్ ల ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ.. కమిటీల ఎంపిక విషయంలో కలిగిన అవరోధాలు ఆరోపణల విషయంలో ఆవేదన వెలిబుచ్చారు.

పదవులు ఎవరికి రావాలో, అది అధిష్టానం చూసుకుంటుందని కార్యకర్తలు తమ తమ గ్రామాల్లో ప్రజలకు అత్యంత సమీపంగా మెలిగి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, నాయకులు ఎవరు కావాలో, ప్రజలే నిర్ణయిస్తారని ఎమ్మెల్యేకు ప్రతిరోజు కనబడడం వల్ల స్థానిక ఎన్నికల్లో అవకాశం వస్తుందని, అనుకోవడం సరికాదని, ఆయన ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ నిర్ణయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొని, చివరికి సామాజిక న్యాయం పాటించి, దళిత, మైనారిటీ, బీసీ, ఎస్టీలకు, సముచిత స్థానం కల్పించి, న్యాయం చేసామని, చైర్మన్ పదవి కోసం పోటీపడ్డవారు, తమకు అవకాశం దక్కలేదని నిరాశ పడవద్దు అని, ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయన్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ పనితీరుపై ఇతర పార్టీల వారు మొరగవచ్చు కానీ, సొంత పార్టీ కార్యకర్తలే నానా విధాలుగా మొరిగితే, చూస్తూ ఊరుకోనని, వారికి పార్టీ వీడి వెళ్లాలనిపిస్తే, పార్టీ విడిచి వెళ్లిపోవచ్చునని, ఇతర పార్టీ నాయకులతో సాంగత్యం, తన దృష్టికి వస్తే, ఖచ్చితంగా చర్యలు ఉంటాయని, పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యే హెచ్చరించారు. నియోజకవర్గంలో అన్ని మార్కెట్ కమిటీలకు తగిన సామాజిక న్యాయం పాటించానని, ఎటువంటి ప్రలోభాలకు తాను లొంగబోనని తనకు రాజకీయ భవిష్యత్తు చాలా ఉందని, ఇప్పుడే తనకు భవిష్యత్తు లేకుండా చేసుకోనని తను డబ్బుకు లొంగే రకం కాదని, తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నానని ఏ కాంట్రాక్టర్ దగ్గరైన పైసా ఆశించకుండా అభివృద్ధి పనులు ప్రారంభించామని, గతంలోని నిధుల కంటే, ప్రస్తుతం నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకువచ్చానని, ఖానాపూర్ ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, పార్టీ మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పడగల భూషణ్, వైస్ చైర్మన్ మజీద్, పట్టన అధ్యక్షులు నిమ్మల రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, అంకం రాజేందర్, మాజీ ఎంపీపీ అలెగ్జాండర్, కడార్ల గంగ నరసయ్య, నాయకులు యూసఫ్ ఖాన్, మడిగెల గంగాధర్, అడ్వాల శేఖర్ తదితరులు ఉన్నారు.