calender_icon.png 1 November, 2024 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో ఆ ఇద్దరే

04-08-2024 12:31:45 AM

పసిడి కోసం అల్కారాజ్, జొకోవిచ్ ఢీ

పారిస్: కొన్ని మ్యాచ్‌లకు యమ క్రేజ్ ఉంటుంది. కొదమ సింహాల్లా తలపడే ఇద్దరు నెల వ్యవధిలో మరో ఫైనల్లో తలపడుతున్నారంటే ఆ పోరు రసవత్తరంగా ఉండడం ఖాయం. పారిస్ ఒలింపిక్స్ అందుకు వేదిక కానుంది. పురుషుల టెన్నిస్ సింగిల్స్ ఫైనల్ స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కారాజ్, సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ మధ్య జరగనుంది. 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించినప్పటికీ జొకో ఒలింపిక్స్‌లో స్వర్ణం మాత్రం గెలుచుకోలేదు. ఈసారి వచ్చిన అవకాశం జొకో ఒడిసిపట్టాలని భావిస్తుంటే.. నాదల్ తర్వాత స్పెయిన్ తరఫున టెన్నిస్‌లో దేశానికి రెండో పసిడి అందించాలని అల్కారాజ్ ఉవ్విళ్లూరుతున్నాడు. నెల రోజుల క్రితం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ ఈ ఇద్దరి మధ్యే జరగ్గా.. అల్కారాజ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ కాంస్యం గెలుచుకుంది.