calender_icon.png 24 December, 2024 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌లో మిగిలేది ఆ నలుగురే

10-07-2024 04:21:49 AM

  • త్వరలో 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి 
  • ఫిరాయింపులు మొదలు పెట్టింది బీఆర్‌ఎస్సే 
  • ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీలో మిగిలేది ఆ నలుగురేనని, త్వరలోనే మరో 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య చెప్పారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందన్నారు. పార్టీ ఫిరాయింపులకు మొదటగా పాల్పడింది బీఆర్‌ఎస్ పార్టీనేనని విమర్శించారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దందాలు, కాంట్రాక్టర్ల కోసం ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరితే ఇప్పుడు ప్రజాపాలన కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని తెలిపారు.

ప్రజలతో పేగు బంధాన్ని తెంచుకున్నదే కేసీఆర్ అని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బస్సుయాత్ర చేశారని అయిలయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు మనగడ లేదని, గల్లీలో ముఖం లేకనే కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ సురేశ్‌రెడ్డి ఢిల్లీ బాట పట్టారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనలు చేస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోవడం లేదన్నారు. 

త్వరలో బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం.. 

బీజేపీతో ఫ్రెండ్‌షిప్ కోసం బీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని, త్వరలోనే కమలం పార్టీలో విలీనం చేయడానికి సిద్ధపడ్డారని అయిలయ్య వ్యాఖ్యాని ంచారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క సీటు గెలవలేదన్నారు.