calender_icon.png 26 December, 2024 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా అందాన్ని అప్పుడే చూస్తారు!

26-12-2024 01:53:53 AM

గ్లామర్, డీ గ్లామర్ అన్న తేడా లేకుండా అన్ని రకాల పాత్రల్లో కనబడుతూ సగటు ప్రేక్షకుడికి చేరవవుతోంది మాళవికా మోహనన్. ఈ ఏడాది ‘తంగలాన్’, ‘యుధ్రా’ వంటి విభిన్న సినిమాల్లో నటించి అలరించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ‘ఆస్క్ మాళవిక’ అంటూ ఎక్స్ వేదికగా అభిమానులకు అందుబాటులోకి వచ్చింది.

ఈ చిట్‌చాట్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 2025 మీకు ఎలా ఉండనుంది? అని ఓ అభిమాని అడిగితే “సర్దార్2’, ‘రాజాసాబ్’ కొత్త షెడ్యూల్స్‌తో కొత్త సంవత్సరంలో ప్రయాణం ప్రారంభం కానుంది. వరుస సినిమా లతో వచ్చే ఏడాది నాకు చాలా ప్రత్యేకంగా ఉండనుంది” అని చెప్పింది. ఈతరం యువతకు మీరిచ్చే సలహా ఏంటని అడిగితే.. ‘పని ఏదైనా షార్ట్‌కట్స్ అనేవి ఉండవు.

మనం శ్రమిస్తేనే విజయాన్ని ఆస్వాదించగలం’ అని హితబోధ చేసింది. విరాట్, అల్లు అర్జున్‌ను ఒక్క మాట లో వర్ణించండి అన్న అభిమానికి మాళవిక ‘ఒక్క మాటలో కష్టం.. కాకపోతే కోహ్లీ కింగ్. అల్లు అర్జున్ స్టుల్ ఎవరిలోనూ కనిపించదు’ అని సమాధానమిచ్చింది. ఇక ‘మీ జీవితాన్ని మార్చిన సూచన ఏంటి?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ.. “ఒక పెద్దాయన ఒకానొక టైంలో ఏం చెప్పారంటే..

‘కామెంట్ సెక్షన్‌ను ఏమాత్రం చదవొద్దు’ అనీ! ఈ ఒక్క మాట నా జీవితాన్ని ఎంతో మార్చింది” అని వివరించింది. తెలుగు ప్రేక్షకులకు మీ అందాన్ని ఎప్పుడు చూపించనున్నారు? అన్న చిలిపి ప్రశ్నతో సరదా తీర్చుకున్న అభిమానికి.. ‘వచ్చే ఏడాది ఆగస్టులో ‘రాజాసాబ్’ విడుదల. నేను అందంగా ఉన్నానో, లేదో ప్రేక్షకులే నిర్ణయించాలి’ అని తెలివిగా సమాధానపర్చింది మాళవిక.