calender_icon.png 9 January, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ తర్వాతే రాజీనామా చేస్తా

07-01-2025 12:40:37 AM

* కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోగానే తప్పుకుంటా: ట్రూడో 

అప్పుడే రాజీనామా.. పార్టీ నాయకత్వానికి, ప్రధాని పదవికి రాజీనా మా చేయనున్న విషయాన్ని పార్టీకి, గవర్నర్‌కు తెలియజేశా. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న వెంటనే రాజీనామా చేస్తా. 

న్యూఢిల్లీ, జనవరి 6:  కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి, లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత బాధ్యతల నుంచి తప్పు కోనున్నట్లు వెల్లడించారు.  పార్టీలో అంతర్గత విభేదాలను అంగీకరించిన ట్రూడో.. వచ్చే ఎన్నికల్లో అంతర్గతంగా పోరాడాల్సి వస్తే తాను ఉత్తమ ఎంపికకాలేనని చెప్పారు.

“నేను ఒక పోరాట యోధుడిని. కెనడియన్ల కోసం ఎంతో శ్రద్ధగా పనిచేసినప్పటికీ నెలల తరబడి పార్లమెంట్ స్తంభించిపోయింది. మార్చి 24 వరకు పార్లమెంట్‌ను ప్రొరోగ్ చేస్తున్నా.” అని ప్రకటించారు. తన భవిష్యత్ గురించి కుటుంబంతో సుదీర్ఘ చర్చలు జరిపానని చెప్పారు. సోమవారం ఉదయం నుంచే ట్రూడో రాజీనామా చేస్తారనే వార్తలు వెల్లువెత్తాయి.

ట్రూడోపై దేశవ్యాప్తంగా ప్రజ ల్లో వ్యతిరేకత పెరిగిపోవడం, లిబరల్ పార్టీకి గెలిచే అవకాశాలు సన్నగిల్లడంతో ట్రూడో తప్పుకోవచ్చని ది గ్లోబ్ అండ్ మెయిల్ పత్రిక కథనాన్ని సైతం వెలువరించింది. అక్టోబర్‌లో జరగనున్న ఫెడరల్ ఎన్నికల్లో ట్రూ డో పార్టీ లిబరల్స్‌కు, ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ల చేతిలో ఘోర ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్నాయి.

ట్రూడో విధానాలను వ్యతిరేకి స్తూ దేశ ఆర్థిక మంత్రి, ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ వైదొలిగిన నెల రోజుల్లోనే ఈ పరిణామాలు నెలకొనడం గమనార్హం.