కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
న్యూ ఢిల్లీ, జూలై 21: మనదేశం చైనాతో పోటీపడాలంటే ముందుగా అనువైన ఆర్థిక విధానాలు, యువతకు ఉద్యోగ కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. నాగ్‌పూర్‌లో లోక్‌సత్తా పత్రిక ఎడిటర్ గిరీశ్ కుబేర్ రచించిన ‘మేడ్ ఇన్ చైనా’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ దేశ ఆర్థిక ప్రగతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వృద్ధిని ప్రోత్సహించడానికి భారతదేశానికి అనువైన ఆర్థిక విధానాలు అవసరం. కొవిడ్ అనంతరం చాలా దేశాలు చైనాతో వ్యాపా రం చేయడానికి ఆసక్తి చూపించడంలేదు. దీంతో అక్కడ కంపెనీలు మూతపడు తున్నాయి. ఈ క్రమంలో భారత్ తయారీ రంగంపై దృష్టి సారిస్తే యువతకు పెద్ద ఎత్తున అవకాశాలతో పాటు దేశ ఆర్థిక వృద్ధి గణనీయమైన పెరుగుతుంది. వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసంరం ఉంది. అప్పుడే ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం అవుతుంది. అప్పుడే ప్రపంచంలో మన స్థానాన్ని మెరుగుపర్చుకునేందుకు అవ కాశం ఉంటుందని అన్నారు.