04-04-2025 12:46:38 AM
- సిద్దిపేట ఏసీపీ మధు
సిద్దిపేట, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): రవాణా శాఖ జిల్లా అధికారిగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన కొండల్ రావుకు రవాణా శాఖ అధికారులు, సిబ్బంది బుధవారం రాత్రి కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. పదవి విరమణ పొందిన కొండలు రావును అధికారులు, సిబ్బంది శాలవాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మధు, రవాణా శాఖ అధికారి పి. శంకర్ నారాయణ లు మాట్లాడారు. విధినిర్వహణలో చేసిన సేవలు శాశ్వతంగా గుర్తుండిపోతాయన్నారు. రవాణా శాఖలో కొండల్ రావు తన విధి నిర్వహణలో శాఖ పరంగా ప్రజలకు ఎంతో సేవలు అందించారని కొనియాడారు. క్రమశిక్షణతో, స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్నలను పొందినారన్నారు.
పదవి విరమణ అనేది అనివార్యమని, ప్రతిఒక్కరూ పదవీ విరమణ పొందుతారన్నారు. వారి భావిజీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం అధికారులు, సిబ్బంది కొండల్ రావు కుటుంబసభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ ఉపెందర్, రవాణా శాఖ అధికారులు సంతో ష్, పురుషోత్తం, క్రిస్టోపర్, శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, నజీర్, ఆర్టియే మెంబర్ సూర్య వర్మ, వివిధ పార్టీల నాయకులు రాముగౌడ్, తిరుపతి రెడ్డి, కృష్ణ తదితరులు ఉన్నారు.