calender_icon.png 14 March, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన ఎరువులు, విత్తనాలను మాత్రమే విక్రయించాలి

13-03-2025 12:00:00 AM

జిల్లా వ్యవసాయ అధికారి వినయ్

పాపన్నపేట, మార్చి 12:  రైతులకు నాణ్యమైన ఎరువులు విత్తనాలను మాత్రమే విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ సూచించారు. బుధవారం ఆయన మండల పరిధిలోని పాపన్నపేట మరియు చిత్రియల్ లో గల ఎరువుల దుకాణాలను మరియు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల అనుసారం రైతులకు నాణ్యమైన ఎరువులు విత్తనాలను మాత్రమే విగ్రహించాలని దుకాణదారులకు సూచించారు.

కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్ లను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. రైతులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం ఎలాంటి సందేహాలు ఉన్న స్థానిక వ్యవసాయ అధికారుల ద్వారా నివృత్తి చేసుకొని అధికారులు సూచించిన మందులను మాత్రమే పంటలకు వాడాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారిని నాగ మాధురి ఉన్నారు